క్వారంటైన్ కేంద్రాలు వ్యాధిని తగ్గించడానికా?.. ప్రజల్ని చంపడానికా?: లోకేష్

ABN , First Publish Date - 2020-09-25T14:56:28+05:30 IST

కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

క్వారంటైన్ కేంద్రాలు వ్యాధిని తగ్గించడానికా?.. ప్రజల్ని చంపడానికా?: లోకేష్

అమరావతి: కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వైసీపీ నిర్లక్ష్యాన్ని వీడటం లేదని...క్వారంటైన కేంద్రాల్లో కరోనా బాధతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ట్విట్టర్ వేదికంగా లోకేష్ వ్యాఖ్యానించారు. ‘‘కరోనా పెద్ద విషయం కాదు అని ఆరున్నర లక్షల మంది కరోనా బారిన పడటానికి కారణమయ్యారు. బ్లీచింగ్ చల్లితే చచ్చిపోతుంది, పేరాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి 5,506 మంది చావుకి కారణమయ్యారు సీఎం జగన్ గారు. అయినా వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. తమని జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేవు, తినడానికి తిండి పెట్టరు. క్వారంటైన్ కేంద్రాలు వ్యాధి తగ్గించడానికా? ప్రజల్ని చంపడానికా?’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-09-25T14:56:28+05:30 IST