Abn logo
Oct 24 2020 @ 08:37AM

దుర్గమ్మను దర్శించుకున్న చినరాజప్ప

విజయవాడ: మాజీ హోంమంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప శనివారం ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కోవిడ్‌కు తగ్గట్లుగా దుర్గగుడి వద్ద ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారని చెప్పారు. పలు ప్రాంతాల నుంచి భవానీలు అమ్మవారి దర్శనం  కోసం తరలివస్తున్నారని... భవానీలకు తగిన ఏర్పాట్లు కల్పించాల్సిన బాధ్యత దేవస్థానంపై ఉందన్నారు. కరోనా త్వరగా పోవాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చినరాజప్ప తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement