పార్టీ మారలేదనే కక్షగట్టారు

ABN , First Publish Date - 2021-06-15T08:29:44+05:30 IST

విశాఖ గాజువాక మండలం తుంగ్లాం, యాదవజగ్గరాజుపేటల్లో 49 ఎకరాల ప్రభుత్వ భూమిని తాను ఆక్రమించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని మాజీ

పార్టీ మారలేదనే కక్షగట్టారు

ఆక్రమణదారుగా ముద్ర వేస్తున్నారు

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

లేకపోతే సాయిరెడ్డి విశాఖ విడిచిపోతారా?

టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు సవాల్‌

‘విశాఖ ఉక్కు’ దీక్ష చేశానని వేధిస్తున్నారు

ఎక్కడివో ఆక్రమణలను తొలగించారు

అవి నా కుటుంబానివేనంటారా?

టీడీపీలోనే ఉంటా.. టీడీపీలోనే చస్తా

మాజీ ఎమ్మెల్యే స్పష్టీకరణ


విశాఖపట్నం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): విశాఖ గాజువాక మండలం తుంగ్లాం, యాదవజగ్గరాజుపేటల్లో 49 ఎకరాల ప్రభుత్వ భూమిని తాను ఆక్రమించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్‌ చేశారు. ఒకవేళ ఆక్రమణలు నిరూపించలేకపోతే విశాఖలో స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించి ఆయన నగరం విడిచి వెళ్లిపోవాలన్నారు. సో మవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశంలో ఉన్న తనను పార్టీ మారాలని ఒత్తి డి తెచ్చారని, పార్టీ మారనంత మాత్రాన కక్ష గట్టి ఆక్రమణదారుడిగా ముద్ర వేసి బలిపశువును చే స్తారా అని పల్లా ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను దీక్ష చేయడం సాయిరెడ్డికి కోపం తెప్పించిందని, అప్ప టి నుంచి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం టీడీపీలోనే ఉంటాన ని.. టీడీపీలోనే చస్తానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం అధికారులు తుంగ్లాం, కాపుజగ్గరాజుపేటల్లో తొలగించిన ఆక్రమణల్లో తనకు చెందినవి 49 ఎకరాలు ఉన్నాయని, వాటి విలువ రూ.750 కోట్లుగా అధికార పార్టీ నేతలు ప్రకటించడంపై పల్లా అభ్యంతరం వ్యక్తంచేశారు.


తమ కుటుంబానికి యాదవ జగ్గరాజుపేటలో భూములు ఉన్నాయని..కాపుజగ్గరాజుపేటలో ఆక్రమణలు చూ సి తమకి చెందినవిగా భావించి సీఎంకు తప్పుడు నివేదిక ఇచ్చారని దుయ్యబట్టారు. విచిత్రమేమిటంటే.. రెండు జగ్గరాజుపేటల్లో ఒకే సర్వే నంబర్లు ఉండడంతో కాపుజగ్గరాజుపేటలో ఆక్రమణలు తమవని భావించి అధికార పార్టీ నేతలు హడావుడి చేశారని తెలిపారు. కాపుజగ్గరాజుపేట సర్వే నంబరు 28లోని 19 ఎకరాల చెరువు రైల్వే శాఖద ని చెప్పారు. యాదవజగ్గరాజుపేటలోని సర్వే నం బరు 12-6లో తమకున్న ఆరెకరాల భూమిని ఆక్రమణగా చూపించారని తప్పుబట్టారు. ఎవరి ఆక్రమణలనో తొలగించి, అవి తమ కుటుంబానివని చెప్పడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. 


మా ఫెన్సింగ్‌ తొలగించారు..

యాదవజగ్గరాజుపేట సర్వే నంబరు-14లో చెరువుకు ఆనుకుని ఉన్న తమ స్థలంలో రెండడుగుల వరకు ఫెన్సింగ్‌ను తొలగించారని పల్లా చెప్పా రు. ఇంకా తమ కుటుంబానికి చెందిన భూముల మధ్య సుమారు 71 సెంట్లు రాస్తా(నడకదారి) ప్రభుత్వానికి చెందిన ది ఉందన్నారు. రాస్తాను తమ కుటుం బం ఆక్రమించిందని భావించిన అధికారులు సర్వే నంబరు 10లో 36 సెంట్లు, 33లో 24 సెంట్లు, 34లో 13 సెంట్లు వెరసి 71 సెంట్లలో బోర్డులు పెట్టారని.. రాస్తాగా పేర్కొన్న భూమిని తమకు బదలాయిస్తే ప్రత్యామ్నాయంగా భూమి ఇస్తామని 2013 లోనే గాజువాక తహశీల్దార్‌కు తాము దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రాస్తాగా ఉన్న ఆ భూమి ఖాళీగానే ఉందని, దానిని తామేమీ ఆక్రమించలేదన్నారు. ఇంతకు మించి తమ భూముల్లో ఆక్రమణలు ఏమైనా తొలగించారేమో చెప్పాలని అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు.


ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకుంటాం..మంత్రి ముత్తంశెట్టి  

విశాఖపట్నం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఆక్రమణదారుల చేతుల్లోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పా రు. విశాఖలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గాజువాక వద్ద మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్వాధీనంలో ఉన్న 40 ఎకరాలను అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు విశాఖ జిల్లాలో రూ.4,776 కోట్ల విలువైన 430 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగిపోలేదని చెప్పారు. జిల్లాలో ఇనాం, ఎస్టేట్‌ భూములు అనేకం ఉన్నాయని, కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని వాటిని కొందరు స్వాఽధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ విషయం తెలిసినా, వారిపై గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు.

Updated Date - 2021-06-15T08:29:44+05:30 IST