ఆర్బీఐ లేఖలకు సమాధానమేదీ?

ABN , First Publish Date - 2021-12-02T09:00:16+05:30 IST

ఆర్థిక నేరాల్లో ఆరితేరిన సీఎం జగన్‌రెడ్డి బ్యాంకులను నమ్మొద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

ఆర్బీఐ లేఖలకు సమాధానమేదీ?

  • స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.. కార్పొరేషన్‌ సూట్‌ కేస్‌ కంపెనీ
  • ప్రజాధనం దోపిడీకి పన్నాగం.. సీఎంపై టీడీపీ నేత పట్టాభి ధ్వజం


 అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆర్థిక నేరాల్లో ఆరితేరిన సీఎం జగన్‌రెడ్డి బ్యాంకులను నమ్మొద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మండిపడ్డారు. వర్సిటీలు, వివిధ సంస్థల సొమ్మును దిగమిం గడానికే ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ని సృష్టిం చారని ఆరోపించారు. ‘‘ప్రభుత్వ బ్యాంకులను నమ్మవుగానీ, అవి ఇచ్చే అప్పులు మాత్రం కావాలా జగన్‌రెడ్డి?’’ అని నిలదీశారు. స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌కి సంబంధించి ఆర్బీఐ లేవనెత్తిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పట్టాభి మీడియాతో మాట్లాడారు. షెల్‌, సూట్‌ కేసు కంపెనీలు సృష్టిం చడం, మనీ లాండరింగ్‌ చేయడం, అక్రమార్జనను విదేశాలకు తరలిం చడమనేది ఏ1, ఏ2 లకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శిం చారు. ఈ నైపుణ్యం తోనే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ అనే సూట్‌ కేస్‌ కంపెనీలు, షెల్‌ కంపెనీలు పెట్టి, వాటి ద్వారా ప్రభుత్వ, ప్రజల సొమ్ముని కొట్టేయ డానికి జగన్‌ సిద్ధమయ్యారని ఆరోపించారు.  2020 మార్చి 6న జీవో నెంబర్‌ 18తో ఏపీఎ్‌సఎఫ్‌ ఎస్‌సీని నెలకొల్పిన జగన్‌రెడ్డి, తర్వాత దానిలో షేర్‌ హోల్డర్‌గా గవర్నర్‌తో పాటు ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, చీఫ్‌ సెక్రటరీతో సహా ఆరేడుగురు ఐఏఎ్‌సలను చేర్చారని తెలిపారు.


తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని శాఖలు, సొసైటీలు, వర్సిటీలు, ట్రస్ట్‌లు, ఏస్పీవీలతో సహా అన్ని విభాగాల్లోని సొమ్మును దీనిలో డిపాజిట్‌ చేయాలని ఆదేశించారని అన్నారు. గిడ్డంగుల సంస్థలో రూ.9.60  కోట్లు, ఆయిల్‌ఫెడ్‌లో రూ.5 కోట్లను కొందరు ఉద్యోగు లు కొల్లగొట్టడాన్ని ఉదహరిస్తూ.. బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ముకు భద్రత లేదనే అభిప్రా యాన్ని జగన్‌ సర్కార్‌ వెలిబుచ్చిం దన్నారు. అంటే దేశంలోని బ్యాంకులేవీ సురక్షితం కాదా? అని ప్రశ్నిం చారు. మరి ఆయా బ్యాంకులిచ్చే రుణాలు కావాలా? అని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టార్జితాన్ని కూడా సొంతం చేసుకునేందుకు ఈ సీఎం సిద్ధమవు తాడేమోనన్న సందేహం కలుగుతోందన్నారు. అందుకే ఆర్బీఐ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ సమాచారం ఇవ్వాలని లేఖలు, మెయిల్స్‌ పంపిందని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించక పోవడంతో ఏపీ సర్కార్‌ తీరుపై ఆర్బీఐ సీరియ్‌సగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఏపీ, తెలంగాణ రీజనల్‌ డైరెక్టర్‌ నిఖిల ఈమెయిల్‌లో పేర్కొన్నారని చెప్పారు. ఇప్పటికి 3 లేఖలు రాసినా ఆర్బీఐ అడిగిన సమాచారాన్ని ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారని పట్టాభి నిలదీశారు.  

Updated Date - 2021-12-02T09:00:16+05:30 IST