2024లో టీడీపీదే అధికారం : మాలేపాటి

ABN , First Publish Date - 2022-01-29T03:43:19+05:30 IST

రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని అప్పుడు పార్టీకోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తారని నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యుడు మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు.

2024లో టీడీపీదే అధికారం : మాలేపాటి
మాట్లాడుతున్న మాలేపాటి సుబ్బానాయుడు

కావలి, జనవరి 28: రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని అప్పుడు పార్టీకోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తారని నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యుడు మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. కావలి రూరల్‌ మండల టీడీపీ సంస్థాగత ఎన్నికల సమావేశం రూరల్‌ మండల అధ్యక్షుడు కోసూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం పట్టణంలోని ఎంజీఆర్‌ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ టీడీపీ క్యాడర్‌ ఇప్పటి నుంచి కష్టపడి పనిచేయాలని, కావలిలో టీడీపీ జండా ఎగురవేయాలన్నారు. 

రూరల్‌ కమిటీ నియామకం

 టీడీపీ కావలి రూరల్‌ మండల అధ్యక్షుడిగా ఆవుల రామకృష్ణ, ప్రధానకార్యదర్శిగా ఉప్పాల వెంకట్రావు, మండల తెలుగు యువత అధ్యక్షుడిగా తాతా హరిబాబు, ప్రధాన కార్యదర్శిగా పులిరమేష్‌ యాదవ్‌లను నియమించారు. మండల బీసీసెల్‌ అధ్యక్షుడిగా కమతం బలరాం, ప్రధానకార్యదర్శిగా యల్లంగారి యానాదిరావు, మండల ఐ టీడీపీ అధ్యక్షుడిగా చిమ్మిలి మార్కండేయులను నియమించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు కొనసాగిన కోసూరు వెంకటేశ్వర్లును సన్మానించారు. ఈ కార్యక్రమంలో త్రిసభ్యకమిటీ సభ్యులు గ్రంధి యానాదిశెట్టి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, నేతలు గుత్తికొండ కిషోర్‌, బీద గిరిధర్‌, మలిశెట్టి వెంకటేశ్వర్లు, కొండూరు పాలిశెట్టి, రూరల్‌మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T03:43:19+05:30 IST