‘ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు తెరవాలి’

ABN , First Publish Date - 2021-12-07T06:04:32+05:30 IST

సీఎం జగన్‌ మాయమాటలు నమ్మి 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇకనైనా ఉద్యోగులు కళ్లు తెరవాలని నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.

‘ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు తెరవాలి’
తోట సీతారామలక్ష్మికి పుష్పగుచ్ఛం అందిస్తున్న బొక్కా సూరిబాబు

భీమవరం అర్బన్‌, డిసెంబరు 6 : సీఎం జగన్‌ మాయమాటలు నమ్మి 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇకనైనా ఉద్యోగులు కళ్లు తెరవాలని నరసాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. చినరంగనిపాలెంలో 6,7,8,9,10 వార్డుల స్ధానిక నాయకుల ప్రజలతో నిర్వహించిన ప్రజా సమస్యలచర్చా వేదిక–గౌరవ సభ సోమవారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోశయ్య మృతికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సం తాపం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ‘నేను ఉన్నాను నేను విన్నాను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రజా సమస్యల చర్చలన్నీ పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీని కౌరవసభగా మార్చారని విమ ర్శించారు. వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వన్‌టైం సెటిల్మెంట్‌ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని  రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అదేశాల మేరకు నియోజకవర్గంలో 15రోజుల పాటు గౌరవ సభ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడారు. పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్‌, అధికార ప్రాతినిధి వీరవల్లి చంద్రశేఖర్‌, వీరవల్లి గంగాభవాని, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు బొక్కా సూరిబాబు, నాయకలు చెల్లబోయిన సుబ్బారావు, గోవింద్‌, పాల శ్రీరామదాసు, జి.త్రిముర్తులు, మద్దుల రాము, మరపట్ల శ్యాంబాబు, గూడూరి సుబ్బారావు, చెల్లబోయిన కిరణ్‌, కోళ్ళ నాగబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:04:32+05:30 IST