పండుగంటే భయపడే పరిస్థితిని కానుకిచ్చిన జగన్ : అనిత

ABN , First Publish Date - 2020-10-25T18:14:31+05:30 IST

తెలుగుదేశం హయాంలో ప్రతి వ్యక్తికి ఉచితంగా పండుగ కానుకలు ఇచ్చామని..

పండుగంటే భయపడే పరిస్థితిని కానుకిచ్చిన జగన్ : అనిత

అమరావతి : తెలుగుదేశం హయాంలో ప్రతి వ్యక్తికి ఉచితంగా పండుగ కానుకలు ఇచ్చామని.. నేడు పండుగ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కానుకిచ్చారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన అనిత.. టీడీపీ హయాంలో ఉచితంగా పండుగ కానుకలు.. జగన్ మాత్రం నేడు పండుగ నాడూ పస్తులే పెట్టారని విమర్శలు గుప్పించారు. ప్రజలపై పన్నులు పెంచి సంపద పోగేసుకోవడమే మీ పాలనా.? ఇదేనా ప్రజలకు ఇచ్చే దసరా కానుక.? అంటూ వైసీపీ ప్రభుత్వంపై అనిత ప్రశ్నల వర్షం కురిపించారు.


తలచుకుంటేనే గుండెపోటు!

ఆదాయం సృష్టించడం చేతకాక పప్పు బెల్లాలపై కూడా పన్నులు ఉల్లి, క్యారెట్ రూ.120కి పైగా ఎగబాకాయి. క్యాబేజీ రూ.80, పచ్చిమిర్చి రూ.130 వరకు పెరిగాయి. పప్పులు, నూనెల ధరలు తలచుకుంటేనే గుండెపోటు ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు ఎలా జరుపుకునేది?. నిత్యావసరాలను ఎలా కొనుగోలు చేసేది.. పెరుగుతున్న ధరలపై కనీసం సమీక్షించారా?. ఆర్భాటానికి మాత్రమే పరికొచ్చేలా ధరల స్థిరీకరణ నిధి ప్రకటన చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు ధరాఘాతానికి పన్నుల భారం బోనస్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పండుగ జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. డీఏ అడిగితే డీఏ క్యాలండర్ ప్రకటించి వంచన చేశారు. నెల రోజుల్లో పరిష్కరిస్తానన్న పీఆర్సీ విషయంలో జగన్ మాట మార్చేశారు’ అని వైసీపీ ప్రభుత్వాన్ని అనిత ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-10-25T18:14:31+05:30 IST