నారాయణస్వామిపై వర్ల రామయ్య ఫైర్

ABN , First Publish Date - 2021-08-25T18:05:04+05:30 IST

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారాయణస్వామిపై వర్ల రామయ్య ఫైర్

అమరావతి: ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ధైర్యంగా మీ ముఖ్యమంత్రి కాంప్ ఆఫీస్‌లో అడుగు పెట్టే దమ్ములేని పిరికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, రాజకీయ ఉద్దంఢుడైన చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలడం అతని రాజకీయ దిగజారుడుతనం’’ అని అన్నారు. ‘‘సూర్యడు మీద ఉమ్మేస్తున్నావు నారాయణ స్వామి, నీ ముఖమ్మీద పడుతుంది. నేల విడిచి సాము చేయకు. ఇంక, మూన్నెల్లే నీ ముచ్చట మూగజీవీ’’ అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-08-25T18:05:04+05:30 IST