సీతయ్య బతికుంటే Kodali Naniకి ఇంకో రకంగా ఉండేది: వర్ల

ABN , First Publish Date - 2021-11-25T17:32:30+05:30 IST

నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే జూనియర్ ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.

సీతయ్య బతికుంటే Kodali Naniకి ఇంకో రకంగా ఉండేది: వర్ల

విజయవాడ: నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే జూనియర్ ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వర్ల రామయ్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలపై జూనియర్ ఎన్టీయార్ స్పందించిన తీరును తప్పు బడుతూ నందమూరి హరికృష్ణ గురించి ప్రస్తావించారు. ‘‘మీ నాన్న బతికుంటే ఇంకో రకంగా ఉండేది. సీతయ్య(హరికృష్ణ) బతికుంటే నేరుగా రంగంలోకి దిగేవాడు. రచ్చ రచ్చ చేసుండేవాడు. అలా మీరు(ఎన్టీయార్) ఎందుకు చేయలేకపోయారు? మీ నాన్నకు చెల్లెలు అయినప్పుడు మీకు అత్తే కదా?.. మీ మేనత్తను అంటే ఇలాగేనా స్పందించేది?’’ అంటూ వర్ల రామయ్య నిలదీశారు.


జూనియర్ ఎన్టీయార్ స్పందన ప్రవచనాలు చెప్పినట్లు ఉందని, ఆ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీయార్ అంటే పేర్ని నానికి, వల్లభనేని వంశీకి చాలా భయమని చెప్పారు. ఎన్టీయార్ వార్నింగ్ ఇస్తే వాళ్లిద్దరూ తోకలు ముడుచుకుని పోతారని వర్ల అభిప్రాయపడ్డారు. ఎన్టీయార్ స్పందించిన తీరు చూసి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధపడ్డారని తెలిపారు.



Updated Date - 2021-11-25T17:32:30+05:30 IST