Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 14 2020 @ 13:12PM

ఐటీ దాడులతో మాకేం సంబంధం.. వైసీపీ నేతలపై యనమల ఫైర్

అమరావతి: ఐటీ దాడులను రాజకీయం చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై ఐటీ దాడులు పార్టీకి సంబంధం లేనివన్నారు. అవి పూర్తిగా శ్రీనివాస్ వ్యక్తిగతమని పేర్కొన్నారు. గత 40 ఏళ్లలో చంద్రబాబు దగ్గర 15 మంది పీఎస్‌లు, పీఏలు పనిచేశారని.. మాజీ పీఎస్‌పై దాడులు జరిగితే పార్టీకి అంటగట్టడం హేయమన్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోడానికే ఎదుటివాళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీపై ఫిర్యాదులు చేసేందుకే విజయసాయిరెడ్డికి.. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారన్నారు. జగన్‌.. షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయిరెడ్డేనని.. జగన్‌ రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరిందన్నారు. ట్రయల్స్‌కు హాజరుకాకుండా అందుకే ఎగ్గొడుతున్నారన్నారు. హైకోర్టులో సీబీఐ పిటిషన్‌కు జగన్‌ జవాబు ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement