ఏపీలో ‘జే గ్యాంగ్‌’ దోపిడీతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు: Yanamala

ABN , First Publish Date - 2021-09-08T14:20:51+05:30 IST

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి లేక నిరుద్యోగం పెరిగిపోతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

ఏపీలో ‘జే గ్యాంగ్‌’ దోపిడీతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు: Yanamala

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి లేక నిరుద్యోగం పెరిగిపోతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పేరు చెబితే పారిశ్రామికవేత్తలు పరార్‌ అవుతున్నారన్నారు. రాష్ట్రంలో ‘‘జే గ్యాంగ్‌’’ దోపిడీతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతోందని విమర్శించారు. పేదల స్కీమ్‌ల్లోనూ వైసీపీ నేతలు స్కాంలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పబ్లిక్‌ రంగంలో పెట్టుబడులకు ఎలాంటి ఆదాయాలు లేకుండా పోయిందన్నారు. 2020 ఏప్రిల్‌-2021 ఏప్రిల్‌ వరకు ఏపీలో ఎఫ్‌డిఐలు రూ.638.72 కోట్లు మాత్రమే అని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో 1% కూడా లేకపోవడం జగన్‌ ప్రభుత్వ విధ్వంసానికి నిదర్శనమన్నారు. సెజ్‌లు, పోర్టులు, ప్రభుత్వ భూములన్నీ జగన్‌ బినామీల పరం చేస్తున్నారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-08T14:20:51+05:30 IST