కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

ABN , First Publish Date - 2020-07-14T11:36:21+05:30 IST

టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు ..

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి, ముప్పిడి


పోడూరు, జూలై 13: టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కొమ్ముచిక్కాలలో మాజీ మంత్రి పితాని సత్యనా రాయణను వారు సోమవారం కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ  ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందన్నారు. టీడీపీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పితాని తనయుడిపై వేధింపులు అప్రజా స్వామికమన్నారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు.  


ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిందే

పెనుమంట్ర/ఆచంట/పెనుగొండ, జూలై 13: బీసీ సామాజికవరం్గంపై కక్షపూరితంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పెనుమంట్ర మండలం శెట్టిబలిజ, గౌడ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. పొలమూరు (గరువు)లో సోమవారం మండల సంఘ అధ్యక్షుడు కడలి ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటికెన సాంబ మాట్లాడుతూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఆయన తనయుడు వెంకట్‌ సురేష్‌లపై రాజకీయ కక్షపూరిత కేసులు బనాయించడాన్ని ఖండించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు వెంకట సురేష్‌పై అక్రమ కేసులు పెడితే బీసీలందరూ ఉద్యమిస్తామని ఆచంట మండల గౌడ, శెట్టిబలిజ సంఘ నాయకులు హెచ్చరించారు.


బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అంగర వర ప్రసాద్‌, రంభ రామారావు ఆరోపించారు. పెనుగొండ మండలం వడలిలో ఉప్పలపాటి చంటి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశాల్లో కేతా లక్ష్మీనారాయణ, కడలి సూర్యారావు, గుబ్బల నాగేశ్వరరావు, కట్టా బాలాజీ, ఆచంట మండల బీసీ సంఘ అధ్యక్షుడు దొంగ నాగార్జును, కార్యదర్శి బాలం వెంకటరమణ, కేతా మీరయ్య, బండి రామారావు, పెనుగొండ నాయకులు ఆడిగర్ల నరసింహమూర్తి, మేకా శివయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T11:36:21+05:30 IST