Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట

అమరావతి: హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి సందర్భంగా టీడీపీ నేతలపై మోపిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం ఇతర సెక్షన్లు కింద నమోదైన కేసుల్లో రిలీఫ్ దొరికింది. ఏడు సంవత్సరాల లోపు శిక్షపడే అవకాశం ఉండటంతో సీఆర్పీసీ 41ఏ సెక్షన్‌ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నాదెళ్ల బ్రహ్మం కేసులో కూడా 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 41ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చి విచారణకు పిలిచేందుకు అవకాశం ఉంది. టీడీపీ నేతల తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు కావటంతో అరెస్టు చేసే అవకాశం లేదని న్యాయవాదులు తెలిపారు. 


టీడీపీ నేతలపై గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదయింది. 11 మంది టీడీపీ  నేతల పేర్లతో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. గుర్తు తెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ నేతలు పట్టాభి, గొట్టిముక్కల, రఘురామరాజు, చెన్నుపాటి గాంధీ, నాగూల్ మీరా, గద్దె రామ్మోహన్ రావు, సుంకర విఘ్ణ, నాదెండ్ల బ్రహ్మం, బోడె ప్రసాద్, జంగాల సాంబశివరావు, బుద్దా వెంకన్న, తమ్మా శంకర్ రెడ్డి, గుర్తుతెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement