మూడేళ్లలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-05-31T05:08:08+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

మూడేళ్లలో అభివృద్ధి శూన్యం
తణుకులో రిక్షా తొక్కి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు, మే 30: వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రి గతంలో మంజూ రైతే, ప్రస్తుత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారని, ఇప్పటికీ పురోగతి లేద న్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో ఇండోర్‌ స్టేడియం, కొమ్మాయి చెర్వు అభివృద్ధి, టిడ్కో ఇళ్లు, చేపల మార్కెట్‌ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్క డే చందంగా ఉన్నాయని, పట్టణంలో ఏం అభివృద్ధి జరిగిందో పాలకులు చెప్పాలన్నారు. మంత్రిగా కారుమూరి పలుకుబడితో ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్నారు. ఒంగోలు మహానాడుకు ఎన్ని అడ్డంకులు సృష్టించి నా విజయవంతమైందన్నారు. 


సామాన్యులకు ధరాభారం

వైసీపీ హయాంలో పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఇబ్బం దులు పడుతున్నారని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు 22, 24 వార్డుల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి పెరిగిన నిత్యావసర ధరల కరపత్రాలను పంపిణీ చేశారు. ఫ్లాట్‌ రిక్షా తొక్కి నిరసన తెలిపారు.  పార్టీ నాయకులు నడిపల్లి సతీష్‌, మారోతు వెంకటేశ్వరావు, కీర్తి శివప్రసాదు, చంద్రశేఖర్‌, డాక్టర్‌ దొమ్మేటి సుధాకర్‌, కలగర వెంకట కృష్ణ, గుబ్బల శ్రీను తోట సూర్యనారాయణ, నల్ల భాస్కరరావు, తాతపూడి మారుతీరావు, ఒమ్మి రాంబాబు, లాజర్‌, సామ్యూల్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.


జగన్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధం

నరసాపురం టౌన్‌: ముఖ్యమంత్రి జగన్‌ పాలనను తరమికొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు, ఇందుకు నిదర్శనం మహానాడుకు వచ్చిన జన సందోహమే కారణమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి రామ్మోహన్‌నాయుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకర్లతో వారు మాట్లాడారు. మహానాడు విజయవంతం చేసిన నాయకు లు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మూడేళ్ల లో రాష్ర్టానికి చేసింది ఏమి లేదన్నారు. అప్పులు, పన్నులు తప్ప సంక్షేమం లేదన్నారు. వైసీపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు రానున్న ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. కొల్లు పెద్దిరాజు, జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవి, వాతాడి ఉమా, రాజ్యలక్ష్మి, పాలూరి బాబ్జి, గుబ్బల నాగరాజు, కత్తిమండ ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-31T05:08:08+05:30 IST