విచ్చలవిడిగా సారా విక్రయాలు

ABN , First Publish Date - 2022-01-22T05:08:48+05:30 IST

కొవ్వూరుపాడు గ్రామంలో సారా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు.

విచ్చలవిడిగా సారా విక్రయాలు
కొవ్వూరుపాడులో మాట్లాడుతున్న ముప్పిడి

గోపాలపురం, జనవరి 21: కొవ్వూరుపాడు గ్రామంలో సారా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. కొవ్వూరుపాడులో శుక్రవారం జరిగిన గౌరవ సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సారా ప్రభావంతో పేద కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో నవోదయం పేరుతో నాటుసారాను నామరూపాలు లేకుండా చేస్తే వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సారా ఏరులై పారుతుందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు రొంగలి సత్యనారాయణ, నూతంగి దొరబాబు, రత్నకుమారి, ఎంపీటీసీలు బొర్రా ఆంజనేయులు, సూర్యచంద్రం, ప్రసాద్‌బాబు, చాపల రవి, చెదలవాడ ప్రసాద్‌, జామి సూర్యచంద్రం, ఎస్‌కే కాశీం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:08:48+05:30 IST