టీడీపీ ముఖ్య నేతల హౌస్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-22T05:01:30+05:30 IST

టీడీపీ అధినేత చేపట్టిన నిరసన దీక్షకు ఆ పార్టీ ముఖ్య నేతలు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగించారు.

టీడీపీ ముఖ్య నేతల హౌస్‌ అరెస్ట్‌
కొవ్వూరు డీఎస్పీతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జవహర్‌

నిరహార దీక్ష భగ్నం చేయడానికి ప్రయత్నాలు



టీడీపీ అధినేత చేపట్టిన నిరసన దీక్షకు ఆ పార్టీ ముఖ్య నేతలు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగించారు. పలు చోట్ల టీడీపీ శ్రేణులు చేపట్టిన దీక్షల్లో నేతలు పాల్గొనకుండా నిర్బంధం చేశారు. మాజీ మంత్రి జవహర్‌ను రెండో రోజు కూడా గృహ నిర్బంధం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, ఎస్‌ఐ తీరుపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలుచోట్ల చేపట్టిన దీక్షల్లో పాల్గొన్న టీడీపీ నేతలు కార్యకర్తలు అధికార పార్టీ ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


కొవ్వూరు, అక్టోబరు 21: పోలీసులు ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని కోర్టును ఆశ్రయించనున్నట్లు మాజీ మంత్రి కేఎస్‌.జవహర్‌ తెలిపారు. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరసన దీక్షకు వెళతారని ముందస్తుగా గురువారం జవహర్‌ను పట్టణ పోలీసులు రెండోరోజు గృహ నిర్బం ధం చేశారు. దీనిపై జవహర్‌ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళుతుండగా పోలీసులు అడ్డగించారు. కొవ్వూరు పట్టణ సీఐ, ఎస్‌ఐలపై డీఎస్పీ కార్యాలయంలో జవహర్‌ ఫిర్యాదు చేశారు.  పోలీసు అదికారులపై వ్యక్తిగతంగా కేసులు వేయనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గూండాలు ఒకపక్క, పోలీసుల దమనకాండ మరోపక్క కొనసాగుతుంటే ఎలా ఎదుర్కొవాలని, చట్టంపై గౌరవం ఉందని, న్యాయస్థానాలను ఆశ్రయించి హక్కులను కాపాడుకుంటామన్నారు.



జంగారెడ్డిగూడెం: చంద్రబాబునాయుడు దీక్షకు మద్దతుగా జంగారెడ్డి గూడెం ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. కోనేటి చంటి, చిత్తపురి దుర్గేష్‌, చిలంకూరి బాబి, నాని, గోలి అనిల్‌, కుక్కల మాధవరావు, బోడ శ్రీనివాసరావు, బూసా సత్యనారా యణ, లాగు సురేష్‌, ఉమ్మడి శ్రీనివాసరావు దీక్ష చేపట్టారు. నంబూరి రామచంద్ర రాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, సాయిల సత్యనారాయణ, ఎస్‌ఎస్‌ ఇస్మాయిల్‌, గొల్లమందల శ్రీనివాస్‌, ఘంటా రామారావు, షేక్‌ యాకూబ్‌, తూటికుంట రాము తదితరులు ఉన్నారు.

శ్రీనివాసపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌చంద్రశేషును రాత్రి నుంచి పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, సీనియర్‌ నాయకులు షేక్‌ ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్‌, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌ తదితరులను గృహ నిర్బంధం చేశారు.


కొయ్యలగూడెం: మండలంలో టీడీపీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మంగపెద్దిదేవిపాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు వాడ పల్లి నాగార్జునను హౌస్‌ అరెస్టు చేశారు. బయ్యన్నగూడెంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ పారేపల్లి రామారావును సభకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.


దేవరపల్లి: స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయం నుంచి అమరావతికి బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును పోలీసులు అడ్డుకు న్నారు. దీనితో క్యాంపు కార్యాలయంలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముప్పిడి దీక్ష చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొయ్యలమూడి చినబాబు, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కొయ్యలమూడి సుధారాణి, మెంతిమి అమరావతి, బొల్లిన శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:01:30+05:30 IST