ఎమ్మెల్యే జోగి రమేష్‌పై చర్యలు తీసుకోవాలి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

ABN , First Publish Date - 2021-10-03T23:09:22+05:30 IST

ఎమ్మెల్యే జోగి రమేష్‌పై చర్యలు తీసుకోవాలి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

ఎమ్మెల్యే జోగి రమేష్‌పై చర్యలు తీసుకోవాలి: దాసరి శ్యామ్ చంద్ర శేషు

జంగారెడ్డి‌గూడెం: మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే జోగి రమేష్, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతితో పాటు, ప్రధాని, గవర్నర్‌కు లేఖలు రాశామని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు తెలిపారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడులకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వికృత, రాక్షస చర్యలను ప్రజలంతా ముఖ్త కంఠంతో ఖండించాలని శ్యామ్ చంద్రశేషు కోరారు. అలాగే దాడికి వెళ్ళిన వ్యక్తులపై కేసులు పెట్టకుండా దాడికి గురయిన వారిపై కేసులు పెట్టడం పోలీసు వ్యవస్థ దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జరిగిన పరిణామంపై కేంద్ర పెద్దలు దృష్టి సారించి ఎమ్మెల్యే జోగి రమేష్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని శ్యామ్ చంద్ర శేషు కోరారు. 


కాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై సెప్టెంబర్ 17న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఎమ్మెల్యే జోగి రమేష్ కారణమని టీడీపీ నేతలు ఆరోపించారు. తమపై కూడా కర్రలు, రాళ్ళు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో పాటు నానా దుర్భాషలు ఆడారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌తో పాటు వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర గవర్నర్‌కు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతలు లేఖలు రాసి పంపుతున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం గ్రామ పార్టీ అధ్యక్షకార్యదర్శులు పొల్నాటి సత్యనారాయణ, తడికల దావీదు, బిసి సెల్ మండల ప్రధాన కార్యదర్శి రాగాని రామకృష్ణ, మండల ఎస్సి సెల్ నాయకులు గొల్లమందల శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఎలికే ప్రసాద్, కేదాసు అర్జునరావు, పొల్నాటి రమేష్, రాగాని శ్రీను, శ్రీను, రాగాని వంశీ, చదలవాడ నాగేశ్వరరావు, తాళ్లూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-03T23:09:22+05:30 IST