జగన్‌ అరాచక పాలనను తరిమికొడదాం

ABN , First Publish Date - 2021-12-08T04:56:43+05:30 IST

జగన్‌ అరాచక పరిపాలనను తరిమికొట్టాలని నరసాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు.

జగన్‌ అరాచక పాలనను తరిమికొడదాం
సమావేశంలో మాట్లాడుతున్న సీతారామలక్ష్మి

నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి


భీమవరం రూరల్‌, డిసెంబరు 7 : జగన్‌ అరాచక పరిపాలనను తరిమికొట్టాలని నరసాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. గూట్లపాడు, దొంగపిండి, కొత్తపూసలమర్రు గ్రామాల్లో మంగళవారం ప్రజా సమస్యల చర్చా వేదిక గౌరవ సభను నిర్వహించారు.  గ్రామాల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా అందరం పోరాడదామని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారఽథి మాట్లాడుతూ ప్రజా ధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేసిన అరాచకంతో ప్రారంభమైన జగన్‌ పరిపాలనకు చమరగీతం పాడాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీల నిధులు దారి మళ్లించి బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌, మామిడిశెట్టి ప్రసాద్‌, కౌరు పృఽథ్వీశంకర్‌, జల్లా వెంకటేశ్వరరావు, బసవాని పోతురాజు, నాగిడి శ్రీనివాస్‌, బసవాని రాంబాబు,  కొల్లాటి నరసింహస్వామి, కొల్లాటి గోవింద్‌, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 



అధికారులకు రక్షణ లేదు : రత్నమాల


నరసాపురం టౌన్‌, డిసెంబరు 7: వైసీపీ పాలనలో మహిళా అధికారులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నరసాపురం పార్లమెంట్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు రత్నమాల ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీ డీవో విజయను వైసీపీ మాజీ సర్పంచ్‌ తాతాజీ బెదిరించడం దీనికి నిదర్శన మన్నారు. అధికారులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.చట్టబద్ధంగా కాకుండా తాము చెప్పినట్టే నడుచుకోవాలని హుకుం జారీ చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో బర్రె ప్రసాద్‌, చల్లా పద్మావతి, కడమి లక్ష్మి, హేమలత, మంగతాయారు, జోగి పండు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:56:43+05:30 IST