Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఓటీఎస్‌ విధానంపై టీడీపీ నిరసన

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 6: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని(ఓటీఎస్‌) ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ముందుగా స్థానిక చెంచలబాబు అతిథిగృహంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని, ఏ ఒక్క లబ్ధిదారులు నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చెంచలబాబుయాదవ్‌, నాయకులు బయ్యన్న, బొజ్జా నరసింహులు, ఖాన్‌సా, చీదర్ల మల్లికార్జున, ఆర్మ్‌స్ట్రాంగ్‌రాజు, రామ్మోహన్‌, అంబటి మస్తాన్‌, రమణయ్య, తులసి తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement