అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం!

ABN , First Publish Date - 2021-10-24T03:17:23+05:30 IST

నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని తెలుగు రైతు తిరుపతి, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు రాపూరు రాధాకృష్ణమనాయుడు, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపం!
మాట్లాడుతున్న తెలుగురైతు నాయకులు

తెలుగురైతు నాయకులు

నెల్లూరు(వ్యవసాయం), అక్టోబరు 23: నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని తెలుగు రైతు తిరుపతి, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు రాపూరు రాధాకృష్ణమనాయుడు, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ సర్వేపల్లి కాలువ పనులు జరుగుతున్నప్పుడే కృష్ణపట్నం, వల్లూరు, జాఫర్‌సాహెబ్‌ కాలువతోపాటు సర్వేపల్లి రిజర్వాయర్‌ కాలువ పూడిక తీసి ఉంటే సాగునీరందేదన్నారు. ఆ పనులు చేపట్టనందున సాగునీరందే పరిస్థితి లేదన్నారు. సర్వేపల్లి కాలువ లైనింగ్‌ పనులు ఆపి సాగునీరు ఇస్తామని చెబుతున్నప్పటికీ ఈ నెలాఖరుకి కూడా నెల్లూరు ఆనకట్ట కింద నీరు ఇవ్వలేరన్నారు. కాలువల పూడిక తీత పనులకు టెండరు నోటీసు శనివారం ఇచ్చారని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 20 రోజులైనా పడుతుందన్నారు. ఆ తరువాత నీరివ్వడం వల్ల  రైతులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. మార్చి ఆఖరికి స్టాండింగ్‌ క్రాప్‌ ఉండకూడదని రైతు సంఘాలు, రైసుమిల్లర్ల అసోసియేషన్‌కు జేసీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. రైతులకు మంచి దిగుబడి ఇస్తున్న 1010 రకం వరిని బ్యాన్‌ చేయడం విచారకరమన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T03:17:23+05:30 IST