Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైఎస్ జయంతికి లేని నిబంధనలు లోకేశ్ పర్యటనకు వచ్చాయా: దాసరి శ్యామ్ చంద్రశేషు

జంగారెడ్డిగూడెం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనకు అవంతరాలు సృష్టించి కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ శ్రీనివాసపురం జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, వారిలో ధైర్యం నింపుతూ భరోసా ఇవ్వడానికి, పరామర్శించడానికి వెళుతుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ కావాలని కేసులను పెట్టి ఇంకెంతకాలం భయపడుతూ పాలన సాగిస్తారని ప్రశ్నించారు. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం.. న్యాయం చేయమని అడిగిన వారిపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి లేని నిబంధనలు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే వచ్చాయా అని శ్యామ్ చంద్ర శేషు ప్రశ్నించారు. పోలీసులు తమ నాయకుల పట్ల అక్రమంగా వ్యవహరిస్తే భవిష్యతులో ఇబ్బంది పడతారని హెచ్చారించారు. 


మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పారు. తెలుగు ప్రజలకు న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందన్నారు. లోకేష్ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. 


అంతకుముందు నిరసన కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, నేతలు గొల్లమందల శ్రీనివాస్, ఆలపాటి రాము, ఎలికే ప్రసాద్, పొల్నాటి సత్యనారాయణ, చదలవాడ నాగేశ్వరరావు, ఈర్ని సూరిబాబు, పారేపల్లి నరేష్, పవన్ దుడిపాల రమణ, షేక్ సాహెబ్, రాగాని శ్రీను, యడ్లపల్లి కొండ, గూడపటి రఘు, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. ఇక నిరసనలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషుతో పాటు మండల ముఖ్యనేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. 


Advertisement
Advertisement