టీడీపీ నిరసనలు

ABN , First Publish Date - 2021-06-17T05:11:35+05:30 IST

కరోనా పరిస్థితులతో ఉపాది కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, డోన్‌ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటనాయునిపల్లె శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు.

టీడీపీ నిరసనలు
పత్తికొండలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

డోన్‌, జూన్‌ 16: కరోనా పరిస్థితులతో ఉపాది కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, డోన్‌ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటనాయునిపల్లె శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌ రెడ్డికి టీడీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆక్సిజన్‌ అందక మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు గోవిందరెడ్డి, అభిరెడ్డిపల్లె గోవిందు, మల్లెంపల్లి జయన్న యాదవ్‌, వెంకటాపురం పెద్దయ్య, ఎల్‌ఐసీ శ్రీరాములు, న్యాయవాది రాముడు, గుండాల నారాయణ స్వామి, విజయుడు పాల్గొన్నారు.


పత్తికొండ: కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10లక్షలు ఆర్థికసాయం ఇచ్చి ఆదుకోవాలని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా నాయకుడు రామానాయుడు డిమాండ్‌ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద బుధవారం టీడీపీ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. టీడీపీ నాయకులు బీటీ గోవింద్‌, కడవల సుధాకర్‌, ఫకృద్దీన్‌, సింగం శీను, రంగస్వామి పాల్గొన్నారు. 


మద్దికెర: కరోనా నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయారని, తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలని టీడీపీ మండల అధ్యక్షుడు శివప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి పెరవలి రామాంజు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర టీడీపీ పిలుపు మేరకు మద్దికెరలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. వైద్య, పారిశుధ్య, పోలీస్‌ కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్న క్యాంటీన్‌ను పేదల ఆకలి తీర్చాలని కోరారు. ప్రతి మండల వైద్యశాలలో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారు. 18ఏళ్లు దాటిన వారందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ నాగభూషణంను కలిసి వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంపీటీసీ పులిశేఖర్‌, మాజీ సర్పంచ్‌ వెంకటవర్మ, టీడీపీ నాయకుడు చిన్నవీరన్న తదితరులు పాల్గొన్నారు. 


తుగ్గలి: కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు తిరుపాలునాయుడు, వెంకటరాముడుచౌదరి ఆరోపించారు. తుగ్గలి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి వినతిపత్రం అందించారు. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ.50లక్షలు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. మాజీ ఎంపీపీ కొమ్మే వెంకటేష్‌, సత్యప్రకాష్‌, బాలన్న, చక్రవర్తి పాల్గొన్నారు. 


గూడూరు: కరోనా బాధితులను ఆదుకోవాలని తెలుగు యువత కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి చరణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలో చరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతం చేయాలన్నారు. అనంతరం వీఆర్వోకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రేమట సురేష్‌, టీడీపీ నాయకులు కోడుమూరు షాషావలి, నరసింహులు, వై.నాగరాజు తదితరులు ఉన్నారు. 


కల్లూరు: కరోనా నివారణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ కల్లూరు మండల టీడీపీ అధ్యక్షుడు డి.రామాంజనేయులు ఆరోపించారు. కల్లూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందించారు. సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు ఎంవీ రామకృష్ణ, పోలిరెడ్డి, ఫిరోజ్‌, పవన్‌, గోపీక్రిష్ణ, సుబ్రహ్మణ్యం, శేషన్న, ఖాజా, అలిపీరా, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-17T05:11:35+05:30 IST