Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుప్పం ఎన్నికల్లో అక్రమాలపై ఎస్‌ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు

చిత్తూరు: కుప్పం ఎన్నికల్లో అక్రమాలపై ఎస్‌ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పంలోని పోలింగ్‌ స్టేషన్‌లను సమస్యాత్మక, సున్నిత.. అతి సున్నిత పోలింగ్‌ స్టేషన్‌లుగా ప్రకటించాలని ఎస్‌ఈసీకి తెలిపారు. పోలింగ్ ప్రక్రియను సీసీటీవీ రికార్డింగ్‌ చేయాలని, ఆ వీడియో లింక్‌ అభ్యర్థులకు ఇవ్వాలని ఎస్‌ఈసీకి టీడీపీ విజ్ఞప్తి చేసింది. టీడీపీ ఫిర్యాదుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఈఏలను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ లేఖ రాసింది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement