Abn logo
Sep 24 2021 @ 18:24PM

కీలక మలుపు తిరిగిన భోగాపురం ఎంపీపీ ఎన్నిక

విజయనగరం: జిల్లాలోని భోగాపురం ఎంపీపీ ఎన్నిక కీలక మలుపు తిరిగింది. వైసీపీ, టీడీపీ సగం సగం ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయని టీడీపీ నేత బంగార్రాజు అన్నారు. భోగాపురం ఎంపీటీసీని రూ.కోటి యాభై లక్షలకు వైసీపీ కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నిక జరిగినప్పుడు ఎమ్మెల్యే అప్పలనాయుడు, కుమారుడు, సభ్యులతో ఏకపక్షంగా అధికారులతో కుమ్మక్కయ్యారని బంగార్రాజు ఆరోపించారు. టీడీపీ సభ్యులను కొనుగోలు చేయవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే అప్పలనాయుడు పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption