Abn logo
May 27 2020 @ 04:44AM

నేడు, రేపు ఖమ్మంలో టీడీపీ మహానాడు

ఖమ్మం మామిళ్లగూడెం, మే 26: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా బుధ, గురువారాల్లో ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మహానాడు నిర్వహిస్తున్నట్టు టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు.


బుధవారం ఉదయం 9గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం  ఎన్టీఆర్‌కు నివాళి, 11గంటలకు జూమ్‌ వెబ్‌నార్‌ ద్వారా మహానాడు వేడుకల వీక్షణ, పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం ఉంటుందన్నారు. అలాగే 28న ఉదయం 9గంటలకు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడంతో పాటు పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఎన్టీఆర్‌ సర్కిల్‌, పార్టీ కార్యాలయం, మార్కెట్‌ వద్ద, పార్శిబంధం ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలుంటాయన్నారు. 

Advertisement
Advertisement