‘మహా’నందం

ABN , First Publish Date - 2020-05-28T08:55:48+05:30 IST

టీడీపీ మహానాడు వేడుకలు తమ్ముళ్లలో మహదానందం నింపాయి. ఉత్సాహం రేకెత్తించాయి. పార్టీ ఆదేశాలకు

‘మహా’నందం

  • టీడీపీ మహానాడు వేడుకల్లో తమ్ముళ్ల ఉత్సాహం
  • జిల్లావ్యాప్తంగా పార్టీ జెండా ఆవిష్కరణ
  • ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున వీక్షణ
  • పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించిన ఘనత టీడీపీదే
  • ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం
  • గెలుపోటములు కొత్త కాదు
  • కార్యకర్తలే ఊపిరి
  • జగన్‌ పాలనపై విసిగిపోయిన జనం
  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి


అనంతపురం వైద్యం, మే 27: టీడీపీ మహానాడు వేడుకలు తమ్ముళ్లలో మహదానందం నింపాయి. ఉత్సాహం రేకెత్తించాయి. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు మహానాడు వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో మహానాడు వేడుకలు నిర్వహిస్తున్నారు. వీటిని వీక్షించేందుకు పార్టీ ప్రత్యేకంగా జూమ్‌ యాప్‌ను ఏర్పాటు చేసింది. ఆ మేరకు బుధవారం తొలిరోజు మహానాడు వేడుకల్లో అనంత తమ్ముళ్లు భారీగా పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండలస్థాయిల్లో పార్టీ జెండాను నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహానాడు వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు చిత్రపటానికి నివాళులర్పించారు. మహానాడు వేడుకలను జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ప్రత్యేక జూమ్‌ యాప్‌ ద్వారా వీక్షించారు. మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలో, పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తిలో, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మడకశిరలో, పార్టీ ఇన్‌చార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కళ్యాణదుర్గంలో, గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, గుత్తిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌, పరిటాల శ్రీరామ్‌ వెంకటాపురంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-28T08:55:48+05:30 IST