తొలిరోజు ముగిసిన టీడీపీ మహానాడు

ABN , First Publish Date - 2020-05-28T00:59:00+05:30 IST

తొలిరోజు టీడీపీ మహానాడు కార్యక్రమం ముగిసింది. తొలిరోజు వర్చువల్ కాన్ఫరెన్స్‌లో 14వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. తొలిరోజు టీడీపీ ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టింది.

తొలిరోజు ముగిసిన టీడీపీ మహానాడు

అమరావతి: తొలిరోజు టీడీపీ మహానాడు కార్యక్రమం ముగిసింది. తొలిరోజు వర్చువల్ కాన్ఫరెన్స్‌లో 14వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. తొలిరోజు టీడీపీ ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టింది. విద్యుత్ చార్జీల పెంపు, మాట తప్పిన జగన్, కరోనా, వలస కార్మికుల అవస్థలు, టీటీడీ భూముల వ్యవహారం, అరాచక పాలనకు ఏడాది, ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అన్నదాత వెన్ను విరిచిన జగన్, సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ తీర్మానాలు చేసింది.


టీడీపీ మహానాడు బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌కు అధినేత చంద్రబాబు నాయుడు, నేతలు నివాళులర్పించారు. రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం  కొనసాగనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ టీడీపీ ఆఫీసు నుంచి ఆన్‌లైన్‌లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ కోలాహలంగా మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరిగేవి. కానీ ఈసారి కరోనా వైరస్‌ దెబ్బ పడింది. లాక్‌డౌన్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-05-28T00:59:00+05:30 IST