Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీని మాట్లాడొద్దని చెప్పడానికి డీజీపీ ఎవరు?: Rammohan

అమరావతి: ఏ అంశంపై అయినా టీడీపీ గాలి మాటలు మాట్లాడదని....అన్ని సాక్షాధారాలతో టీడీపీ మాట్లాడుతుంది అనేది డీజీపీ గుర్తు పెట్టుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీలో పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీని మాట్లాడద్దు అని చెప్పడానికి డీజీపీ ఎవరు అని నిలదీశారు. డీజీపీ, ఎస్పీలు, కమిషనర్‌లు ప్రభుత్వాన్ని వెనకేసుకుని వస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ఎంపీ అన్నారు. ఖాకీ డ్రెస్ వేసుకుని పబ్లిక్‌కి సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని హితువుపలికారు. హెరాయిన్ అంశంలో ‘‘ఈ వే’’ బిల్లు లు బయటకి తీయాలని డిమాండ్ చేశారు. జగన్‌ అన్ని క్రిమినల్ ఐడియాలని విమర్శించారు. హెరాయిన్ సుధాకర్ సొంత ఊరు ద్వారపూడి అని...అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి ఏమైనా లింక్ ఉందా అనేది విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రతో పోరాటం చేయాలని కానీ తమరు తాడేపల్లి ప్యాలస్‌కే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు.


డ్రగ్స్‌పై తాము రాజకీయం చేయడం లేదని..తమకు రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయని... ఇక్కడ నుంచి బ్లాక్ మనీ ఎక్స్‌పోర్టు అవుతుందని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు తమ వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్  విషయంలో ఎందుకు పోలీసులు దర్యాప్తు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ ట్రేడింగ్ కంపెనీ వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని  ఆరోపణలు వస్తున్నాయన్నారు. హోదా కేంద్రాన్ని అడగకుండా తాడేపల్లిలో తల దాచుకున్నారని యెద్దేవా చేశారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే జగన్ కాలు బెనకలేదు కానీ...ఇప్పుడు ఢిల్లీ అంటే కాలు బెణికిందా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ ఒక రాష్ట్రానికి అంటుకుంటే ఇక ఆ రాష్ట్రం నాశనం అవుతుందని తెలిపారు. యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే ఇక ఉద్యోగాలు అడగరు కదా అనేది సీఎం జగన్ క్రిమినల్ ఐడియా అని ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement