అందుకే పబ్లిక్ డొమైన్‌లో జీవోలు ఉంచట్లేదు: అశోక్‌బాబు

ABN , First Publish Date - 2021-08-18T02:32:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రతిపక్షాలు గుర్తిస్తున్నాయనే పబ్లిక్ డొమైన్‌లో జీవోలు ఉంచడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.

అందుకే పబ్లిక్ డొమైన్‌లో జీవోలు ఉంచట్లేదు: అశోక్‌బాబు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రతిపక్షాలు గుర్తిస్తున్నాయనే పబ్లిక్ డొమైన్‌లో జీవోలు ఉంచడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. మంగళవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రభుత్వ ఖర్చుతో మీరు చేసే జీవోలు అన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. అలాగే అన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నాయి. ఏపీ ఛీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఇప్పటికే మూడు సార్లు కోర్టులో నిలబడాల్సి వచ్చింది. ఈరోజు కూడా ఉపాధి హామీ నిధుల విషయంలో మున్సిపల్, పంచాయతీ సెక్రటరీ‌లు కోర్టు‌కి వెళ్లాల్సి వచ్చింది. కోర్టులకి వెళ్లడానికి జీవోలే ఆధారాలు కాబట్టి వాటినే తొలగిస్తే సరిపోతుంది. ఇదే ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన, ఈ విషయంపై త్వరలో కోర్టుని ఆశ్రయిస్తాం’’ అని అశోక్‌బాబు అన్నారు. 

Updated Date - 2021-08-18T02:32:19+05:30 IST