Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ రెండో స్థానం

కడప: రాష్ట్ర ప్రభుత్వం పై టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) తీవ్రంగా మండిపడ్డారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రంలో పులివెందుల మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో దళారులతో వైసీపీ నేతలు కుమ్మక్కయి రైతులను దోచుకుంటున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. విత్తనం నాటిన రైతు ఆ పంటను విక్రయించే నాటికి ప్రాణాలతో ఉండే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో రైతులకు ఏం చేశామో, వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారో బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అని మారెడ్డి సవాల్ విసిరారు. 

Advertisement
Advertisement