Abn logo
Apr 8 2020 @ 03:43AM

ఆ పాపం ఊరికే వదలదు : బుద్దా

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి):కరోనాపై పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కేంద్రం పంపిన ఎన్‌95 మాస్క్‌లు, రక్షణ కిట్లను కొట్టేసి, వారి ప్రాణాలను వైసీపీ నేతలు రిస్కులో పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 10 నెలలుగా ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకుండా చేసి, ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్‌ని, ఎంపీ విజయసాయిరెడ్డిని ఆ పాపం ఊరికే వదలదని మంగళవారం ట్వీట్‌ చేశారు. వైసీపీ నాయకులు మాయం చేసిన మాస్కులు, రక్షణ కిట్లు లెక్క తేల్చాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement