Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏ ఊరిలోనైనా మూడు ఇటుకలు పెట్టారా?

విజయవాడ: టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై మంత్రి అవంతి శ్రీనివాస్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ట్విట్టర్‌లో మంత్రి అవంతికి ఎమ్మెల్సీ బుద్దా కౌంటర్ ఇచ్చారు.  అరగంట మంత్రి అవంతి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన దెప్పి పొడిచారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామంటే వద్దన్నది ఎవరని బుద్దా ప్రశ్నించారు. మూడు రాజధానులు, ముప్పై రాజధానులు అంటూ కాలక్షేపం తప్ప ఏ ఊరిలోనైనా మూడు ఇటుకలు పెట్టారా అని అవంతిని ఆయన సూటిగా ప్రశ్నించారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని మీకు రాజధాని నిర్మాణం అంటూ పెద్ద మాటలు ఎందుకని విమర్శించారు. అయినా మీరు అరగంటలో పంపించే కార్యక్రమంలో బిజీగా ఉండి కూడా సడన్‌గా విశాఖ అభివృద్ధి గుర్తుకు రావడం గొప్ప విషయమేనని మంత్రి అవంతిని ఎమ్మెల్సీ వెంకన్న ఎద్దేవా చేశారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement