కౌరవ సభను గౌరవసభగా మారుద్దాం

ABN , First Publish Date - 2021-12-06T05:45:59+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాల్సిన చట్టసభలను వైసీపీ శాససభ్యులు కౌరవసభగా మార్చారని దానిని గౌరవసభగా మార్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌ అన్నారు.

కౌరవ సభను గౌరవసభగా మారుద్దాం
సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ నేతలు నసీర్‌, ప్రభాకర్‌, రాజామాస్టారు తదితరులు

మహ్మద్‌ నసీర్‌

గుంటూరు, డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాల్సిన చట్టసభలను వైసీపీ శాససభ్యులు కౌరవసభగా మార్చారని దానిని గౌరవసభగా మార్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తూర్పు ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌ అన్నారు. నియోజకవర్గ పరిఽధిలో తలపెట్టిన గౌరవసభ కార్యక్రమ సన్నాహక కార్యక్రమం ఆదివారం ఆయన నేతృత్వంలో పార్టీ జిల్లా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్‌ మాట్లాడుతూ ప్రజాసమస్యలపై సభలో ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ మహిళలను అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. ఏ సభ నుంచైతే తమ అధినేత చంద్రబాబు వచ్చారో అదే సభలో చంద్రబాబును సీఎంగా చేసి కూర్చొపెట్టటమే తమ లక్ష్యమన్నారు. అప్పుడే అది గౌరవ సభగా మారుతుందన్నారు. నియోకవర్గ పరిఽధిలోని ప్రతి రెండు డివిజన్లలో మహిళా నేతల అధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టారు, కార్పొరేటర్లు ఎల్లావుల అశోక్‌, పోతురాజు సమత, ముప్పవరపు భారతి, నేతలు గుడిపల్లి వాణి, పద్మావతి, శైలజ, మల్లిక, రజని, విజయలక్ష్మి, వజ్జలక్ష్మి, రజని తదతరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-06T05:45:59+05:30 IST