Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్కచెల్లెమ్మలకు జగన్‌రెడ్డి టోకరా: లోకేశ్‌

మహిళలు ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపు


అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటానన్న సీఎం జగన్‌రెడ్డి.. చివరికి వారికే టోకరా వేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. డ్వాక్రా నిధుల మళ్లింపు వంటి ప్రభుత్వ దోపిడీ దందాను ఐక్యంగా అడ్డుకోవాలని శుక్రవారం ఓ ప్రకటన పిలుపునిచ్చారు. మహిళలు అభయహస్తం కోసం ఎల్‌ఐసీలో దాచుకున్న రూ.2వేల కోట్లను సర్కారు స్వాహా చేసిందని ఆరోపించారు. ఓటీఎస్‌ పేరిట రూ.10వేలు కట్టకపోతే పథకాలు ఆపేస్తామని నియంతలా బెదిరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇళ్లను ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేస్తామని ప్రకటించారు. కాగా, అనంతపురం జిల్లా యాడికి మండలం కత్తిమానుపల్లికి చెందిన పుల్లమ్మకు భూమి లేకపోయినా.. ఉందనే సాకుతో పెన్షన్‌ కట్‌ చేశారని, వెంటనే పునరుద్ధరించాలని ట్విటర్‌ వేదికగా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement