టీడీపీ నేతల గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2021-10-21T03:26:25+05:30 IST

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకుల దాడులకు నిరసనగా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం

టీడీపీ నేతల గృహ నిర్బంధం
నెలవల సుబ్రహ్మణ్యంను గృహనిర్బంధం చేస్తున్న సీఐ సోమయ్య

నాయుడుపేట/టౌన్‌, అక్టోబరు 20: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకుల దాడులకు నిరసనగా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బుధవారం బంద్‌కు పిలు పునిచ్చారు. దీంతో ఉదయం 6 గంటలకే  నెలవల సుబ్రహ్మణ్యంను సీఐ సోమయ్య గృహనిర్బంధం చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి, టీడీపీ ఎస్సీసెల్‌ నాయకులు డాక్టర్‌ శ్రీపతి బాబులను వారి నివాసాల వద్ద పోలీసులు గృహని ర్బంధం చేశారు. ఇదే సమయంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డిలు టీడీపీ నాయకులతో కలసి దర్గా సెంటర్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న సీఐ సోమయ్య, ఎస్‌ఐ కృష్ణారెడ్డిలు బలవంతంగా వారిని జీపు ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మఽధ్యాహ్నం తరువాత టీడీపీ నాయకులను స్టేషన్‌ నుంచి పంపించారు. 

దాడులు హేయమైన చర్య : నెలవల

 

రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం హేయమైన చర్యఅని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.  వైసీపీ నాయకులు చేస్తున్న  అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీరామ్‌ప్రసాద్‌, అవధానం సుధీర్‌, దార్ల రాజేంద్ర, నానాబాల సుబ్బారావు, నారాయణ, రవి, సుబ్బరాయులు, మిడతా సూరి, మైలారి పెంచలయ్య, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T03:26:25+05:30 IST