అన్నపూర్ణంపేటలో ఎన్టీఆర్‌ విగ్రహం మాయం

ABN , First Publish Date - 2021-09-29T06:54:22+05:30 IST

రాజమహేంద్రవరం 31వ డివిజన్‌ అన్నపూర్ణంపేట లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. అక్క డ ఉన్న విగ్రహం దిమ్మను ధ్వంసం చేశారు.

అన్నపూర్ణంపేటలో ఎన్టీఆర్‌ విగ్రహం మాయం
ఎన్‌టీఆర్‌ విగ్రహ స్థూపం వద్ద నిరసన తెలియజేస్తున్న టీడీపీ నేతలు

  • ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు
  • సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీకి ఫిర్యాదు

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 28: రాజమహేంద్రవరం 31వ డివిజన్‌ అన్నపూర్ణంపేట లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. అక్క డ ఉన్న విగ్రహం దిమ్మను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు ఆదిరెడ్డి వాసు, యర్రా వేణుగోపాలరాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశినవీన్‌కుమార్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ పాలనలో ప్రజలకే కాదు, మహనీయుల విగ్రహాలకు కూడా రక్షణ లేదన్నారు. తమ నాయకుడు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మాయం చేయడం హేయమైన చర్య అ ని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పాత దిమ్మకు మరమ్మతులు చేయించి అక్కడ వి గ్రహాన్ని ఏర్పాటు చేస్తే గిట్టనివారు ఈ పనిచేశారని ఆదిరెడ్డి అప్పారావు ధ్వజమెత్తారు. అనం తరం సెంట్రల్‌జోన్‌ డీఎస్పీ సంతోష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో టీడీపీ పార్ల మెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్‌, కార్యదర్శి కడి తి జోగారావు, తెలుగు మహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తురకల నిర్మల, మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్‌ రాచపల్లి ప్రసాద్‌, లీగల్‌ సెల్‌సభ్యులు నర్సిం గ్‌ శ్రీనివాస్‌, నాయకులు కవులూరి వెంకట్రావు, ఉల్లింగిరాజు, పి.మంగరాజుయాదవ్‌, మొల్లి చిన్నియాదవ్‌, డివిజన్‌ కమిటీ సభ్యులు పల్లా సత్యనారాయణ, రాము, నాగమణి పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T06:54:22+05:30 IST