Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. మరో ఏడుగురి అరెస్ట్

గుంటూరు: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన వెంకట సత్యనారాయణ, రజని సుధాకర్,  వెళ్లబోయినే ప్రభుదాస్, కర్నాటి రామస్వామి, మాదాల పవన్ కుమార్‌తో పాటు గుంటూరుకు చెందిన బోడపాటి కిశోర్ కుమార్, సోమి కమలకుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. మరికొంత నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 


కాగా సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన ఘాటు వ్యాఖ్యలతో టీడీపీ కేంద్రకార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు టీడీపీ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement