రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-01-21T06:39:12+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు సాగించినా పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు ఎదురొడ్డి పోరాడుతున్నారన్నారు. వారి పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. పార్టీ కార్యకర్తలకు జేసీ కుటుంబం అండగా ఉంటుందన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

కార్యకర్తలకు అండగా జేసీ కుటుంబం 

స్థానిక ఎన్నికల్లో సత్తా చూపుదాం  

అందుబాటులో ఉండేందుకే కార్యాలయం

జేసీ పవన్‌రెడ్డి 

తెలుగు తమ్ముళ్ల మధ్య అట్టహాసంగా కార్యాలయ ప్రారంభోత్సవం

అనంతపురం వైద్యం, జనవరి 20: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు సాగించినా పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు ఎదురొడ్డి పోరాడుతున్నారన్నారు. వారి పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. పార్టీ కార్యకర్తలకు జేసీ కుటుంబం అండగా ఉంటుందన్నారు. జిల్లా కేంద్రంలోని గుల్జార్‌పేటలో జేసీ పవన్‌రెడ్డి ప్రత్యేకంగా పార్టీ శ్రేణుల కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని బుధవారం అట్టహాసంగా నిర్వహించా రు. అనంతపురం పార్లమెంటు పరిధిలోని పలు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరాగా, వారి ఆనందోత్సాహాల నడుమ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ పవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పంటలు నష్టపోయిన రైతులకు బీమా, పరిహారం అందించడంలో అన్యాయం జరుగుతోందన్నారు. కొందరు పోలీసు అధికారులు వైసీపీ నాయకులకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తమపైనా, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపైనా దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టే రీతిగా పోలీసులు వ్యవహరిస్తుండటం దారుణమన్నారు. తన తండ్రి, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయాల్లో ఓటమి ఎరుగరన్నారు. ఆయనతో పాటు తన చిన్నాన్న ప్రభాకర్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటున్నారన్నారు. అలాంటి వారిపై దాడులు చేస్తున్నా భద్రత కల్పించడం లేదన్నారు. పార్టీ నాయకు లు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నట్లైతే అలాంటి వారిని తన సొంత డబ్బులతో న్యాయ పోరాటం చేసి కాపాడుకుంటానన్నారు. రెట్టించిన ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల సత్తా ఏంటో చూపాలని పిలుపునిచ్చారు. అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డి, అశ్మిత్‌రెడ్డిలను పలువురు పార్టీ నాయకులు గజమాలలతో సత్కరించారు. ఆయా నియోజక వర్గాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు స్థానిక పార్టీ శ్రేణులు గజమాలలు వేసి సత్కరించారు. కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, కళ్యాణ దుర్గం, శింగనమల, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఉమామహేశ్వరనాయుడు, బండారు శ్రావణిశ్రీ, జేసీ అశ్మిత్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వెంకటశివుడు యాదవ్‌, జేఎల్‌ మురళీ, బుగ్గయ్య చౌదరి, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ రాయల్‌ మురళీ, ముఖ్య నాయకులు ముంటిమడుగు కేశవరెడ్డి, బీకేఎస్‌ రామలింగారెడ్డి, గాండ్ల విశాలాక్షి, గుర్రం ఆదినారాయణ, శివబాల, కృష్ణకుమార్‌, లక్ష్మీనరసింహ, చక్కా నాగేంద్ర, శ్రీకాంత్‌, బండారు ఆనంద్‌, పెద్దపప్పూరు నాగేశ్వరరెడ్డి, కిరణ్‌గౌడ్‌, కులశేఖర్‌ నాయుడు, తెలుగు మహిళ నాయకురాలు ప్రియాంక, మల్లికార్జున, దొడఘట్ట నారాయణ, నరసాపురం ప్రసాద్‌, టీడీపీ నేతలు, కార్యకర్తలు, జేసీ అభిమానులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:39:12+05:30 IST