నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-10-28T11:39:28+05:30 IST

పంట చేతికి వచ్చే దశ లో అతివృష్టితో నష్టపోయిన రైతుల పరిస్థితి ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కనబడటంలేదా అని టీడీపీ అధ్య క్షుడు ఎల్‌ రమణ ప్రశ్నించారు

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

రైతు భరోసా యాత్రలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ


జన్నారం, అక్టోబరు 27: పంట చేతికి వచ్చే దశ లో అతివృష్టితో నష్టపోయిన రైతుల పరిస్థితి ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కనబడటంలేదా అని టీడీపీ అధ్య క్షుడు ఎల్‌ రమణ ప్రశ్నించారు. మంగళవారం కల మడుగులో రైతు భరోసాలో భాగంగా పంట నష్టపో యిన రైతులను పరామర్శించారు. పత్తికి గులాబీ పురుగు సోకడంతో నల్ల పడిందని, అధిక వర్షాలు  కురవడంతో ఉన్న పంట పూర్తిగా నష్టపోయామని రైతులు పేర్కొన్నారు. రమణ మాట్లాడుతూ నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. దొడ్డు రకం పండించే రైతులను సన్నరకం పండిం చాలని చెప్పడంతో నష్టపోయారన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నర నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజిరెడ్డి, ఆనంద్‌, కార్యదర్శి రాజేశ్వర్‌, విజయ్‌, పద్మారావ్‌, రవి, శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - 2020-10-28T11:39:28+05:30 IST