పురపాలక సంఘంలో అవినీతిపై విచారణ జరపండి

ABN , First Publish Date - 2022-01-25T06:35:20+05:30 IST

పురపాలక సంఘంలో అవినీతిపై విచారణ జరపండి

పురపాలక సంఘంలో అవినీతిపై విచారణ జరపండి
టీడీపీ ఫెర్రి కార్యాలయంలో మాట్లాడుతున్న చుట్టుకుదురు, కౌన్సిలర్లు

 కమిషనర్‌పై చర్యలు తీసుకోండి: టీడీపీ కొండపల్లి పట్టణ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు డిమాండ్‌

ఇబ్రహీంపట్నం, జనవరి 24: కొండపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ కొండపల్లి పట్టణ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం టీడీపీ ఫెర్రి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ పి.శ్రీధర్‌ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారని, అభివృద్ధి నిరోధకుడిగా మారిపోయారని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. 29 వార్డుల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సెలవులో ఉంటే సబ్‌ట్రెజరరీ కార్యాలయం నుంచి బిల్లులు ఎలా చెల్లింపులు చేస్తారని ప్రశ్నించారు. పారిశుధ్య సిబ్బందికి ఐదు నెలల వేతన బకాయిలు ఉంటే మరో వైపు లక్షలాది రుపాయలు ఎలా డ్రా చేస్తారని నిలదీశారు. పారిశుధ్య సిబ్బంది వేతనాలపై మాట్లాడితే మీకు సంబంధం లేదు..మేము చూసుకుంటామని చెప్పడం కమిషనర్‌ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వైస్‌ చైర్మెన్‌ అభ్యర్థి కరిమికొండ శ్రీలక్ష్మి అన్నారు. కౌన్సిలర్లు పురపాలక సంఘ కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తారని సచివాలయాల నుంచి కాదని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి రావి ఫణి, టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు, కౌన్సిలర్లు చనమోలు నారాయణరావు, కామినేని అనిల్‌, ఉప్పతల గోపాలరావు, ధరణికోట విజయలక్ష్మి, ముప్పసాని భూలక్ష్మి, జల్లి జ్యోతి, అమ్మాజీ, పులి అరుణకుమారి, కొత్తపల్లి ప్రకాశ్‌, ఎం.డి.అప్సర్‌, బుస్సు నాని పాల్గొన్నారు.


Updated Date - 2022-01-25T06:35:20+05:30 IST