తాళ్లపాక-హత్యరాల రోడ్డులో టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-07-25T04:57:28+05:30 IST

దెబ్బతిన్న రహదారులపై రాష్ట్ర వ్యాప్త టీడీపీ నిరసన కార్యక్రమంలో భాగంగా రాజంపేట మండలం తాళ్లపాక, ప్రముఖ పుణ్యక్షేత్రం హత్యరాలకు వెళ్లే రోడ్డుపై శనివారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయలు నేతృత్వంలో నిరసన చేపట్టారు.

తాళ్లపాక-హత్యరాల రోడ్డులో టీడీపీ నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న బత్యాల చెంగల్‌రాయలు తదితరులు

రాజంపేట, జూలై24 : దెబ్బతిన్న రహదారులపై రాష్ట్ర వ్యాప్త టీడీపీ నిరసన కార్యక్రమంలో భాగంగా రాజంపేట మండలం తాళ్లపాక, ప్రముఖ పుణ్యక్షేత్రం హత్యరాలకు వెళ్లే రోడ్డుపై శనివారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయలు నేతృత్వంలో నిరసన చేపట్టారు. అక్కడే  ఉన్న వంతెన కింది భాగంలో నిలిచివున్న నీటిలో చేపలు పట్టి వినూత్న నిరసన చేశారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అడుగడుగునా అవినీతి పెరిగిపోయిందని, కనీసం దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరించలేకపోతున్నారన్నారు. తాళ్లపాక, హత్యరాల మధ్య మూడు కిలోమీటర్ల లింక్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతిని రోడ్లన్నీ గుంతలమయమైందన్నారు. హైవేను కలిపే ఈ ప్రధాన రహదారిని మూడు కిలోమీటర్ల మేర కోటి ఖర్చుతో పునరుద్ధరిస్తే రాకపోకలు నిరంతరాయంగా సాగుతాయన్నారు.దెబ్బతిన్న రోడ్లను  వర్షాకాలంలోనైనా పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌; టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు డాక్టర్‌ చెన్నూరు సుధాకర్‌, ఖాదర్‌బాషా, పట్టణ, రూరల్‌ అధ్యక్షులు సంజీవరావు, సుబ్రహ్మణ్యంనాయుడు, యాదవ సంఘం నాయకుడు బారతాల శ్రీధర్‌బాబుయాదవ్‌, క్షత్రియ సంఘం నాయకుడు అద్దెపల్లె ప్రతా్‌పరాజు, మాజీ కౌన్సిలర్లు మనుబోలు వెంకటేశ్వర్లు, రామ్‌నగర్‌ నాయకుడు నరసింహ, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బాసినేని వెంకటేశ్వర్లనాయుడు, కోనంకి కృష్ణమూర్తినాయుడు,డీఆర్‌ఎల్‌ మణి, అబుబకర్‌,  మదా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T04:57:28+05:30 IST