టీడీపీ నిరసనలు.. అరెస్టులు

ABN , First Publish Date - 2021-03-02T08:39:40+05:30 IST

చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకొని, నిర్బంధించడాన్ని నిరసి స్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు నిరసనలకు దిగారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర

టీడీపీ నిరసనలు.. అరెస్టులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకొని, నిర్బంధించడాన్ని నిరసి స్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, నేతలు నిరసనలకు దిగారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌ బాబు, జనార్థన్‌, పీ అశోక్‌బాబు, గన్ని కృష్ణా, పిల్లి మాణిక్యాలరావు, గంజి చిరంజీవి, బుచ్చిరామ్‌ప్రసాద్‌, సయ్యద్‌ రఫీ, ఆనంద్‌సూర్య, దారపనేని నరేంద్ర, కుమారస్వామి, వెంకటరాజు, వెంకటేశ్వరావు తదితరులు నిరసనలో పాల్గొన్నారు.


ఏలూరులో స్థానిక పార్లమెంట్‌ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రా జు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని, ఎమ్మెల్సీ పాందువ్వ రాజు, దేవరపల్లిలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు ఆందోళన చేశారు. కర్నూలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి చేపట్టిన నిరసనలో పలువురు నేతలు పాల్గొన్నారు. కడపలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కాగా రైల్వేకోడూరు నుంచి రేణిగుంట విమానాశ్రయం వద్దకు వెళ్లిన టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్‌, జిల్లా టీడీపీ యువత అధ్యక్షుడు బొక్కసం సునీల్‌ రాయల్‌ను పోలీసులు అరెస్టు చేసి తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. పెనుకొండలో అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టగా పోలీసులు అరె్‌స్టచేసి తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లాలో సోమవారం ఎమర్జెన్సీ వాతావరణం కనిపించింది. భారీగా మొహరించిన పోలీసులు, బలవంతపు అరెస్టులు, తరలింపులతో జిల్లా అట్టుడికిపోయిం ది. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్లమీద నిరసనలు తెలిపాయి. కుప్పం, శాంతిపురంలలో నిరసన ర్యాలీలు, ధర్నా లు చేశారు. 


ప్రతిపక్ష నేతకు హక్కు లేదా?: సీపీఐ రామకృష్ణ

టీడీపీ అధినేత చంద్రబాబును రేణిగుంటలో పోలీసులు నిర్బంధించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ‘‘చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం, ఫోన్‌ లాక్కోవడం అమానుషం. భావ ప్రకటనా స్వేచ్ఛకు తూట్లు పొడిచే లా ప్రభుత్వ వైఖరి ఉండడం విచారకరం. ప్రతిపక్షనేతకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా? ఇది ప్రజాస్వామ్యమా? నియంత రాజ్యమా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


నేతల గృహ నిర్బంధం..

చిత్తూరులో ధర్నాకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలను చంద్రబాబు రాకముందే ఎక్కడికక్కడ పో లీసులు గృహనిర్బంధంలో ఉంచారు. వీరిలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు,  పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులున్నారు.    


ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత..

హౌస్‌ అరెస్టుల నుంచి తప్పించుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీడీపీ నేతలు నరసింహయాదవ్‌, నరసింహ ప్రసాద్‌, జేడీ రాజశేఖర్‌ తదితరులను పోలీసులు  అరెస్ట్‌ చేశారు. అందర్నీ వ్యాన్‌లోకి ఎక్కించి ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండా గంటపాటు అటూ ఇటూ తిప్పి చివరకు తిరుపతిలోని ఈస్ట్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే నిర్బంధించారు. 

Updated Date - 2021-03-02T08:39:40+05:30 IST