విజయసాయిరెడ్డికి ట్విట్టర్‌లో అయ్యన్నపాత్రుడు కౌంటర్

ABN , First Publish Date - 2021-01-20T20:44:36+05:30 IST

ఎంపీ విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

విజయసాయిరెడ్డికి ట్విట్టర్‌లో అయ్యన్నపాత్రుడు కౌంటర్

విశాఖ: ఎంపీ విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు  ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘16 నెలలు చిప్పకూడు తిన్న జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డికి బుద్ధి మారలేదు. ఇంకెంత కాలం మీ ఫేక్ ప్రచారం? అందుకే మిమ్మల్ని ఫేక్ గాళ్లు అనేది. సంతబొమ్మాళిలో 3 రోడ్ల జంక్షన్ వెడల్పు టీడీపీ హయాంలో జరిగింది. అక్కడ విగ్రహ ఏర్పాటుకు దిమ్మ కూడా అప్పుడే ఏర్పాటు చేశారు. దిమ్మపై పాత నంది విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. నంది విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టేందుకు దుష్ప్రచారం మొదలు పెట్టారు. జరిగింది విగ్రహ ప్రతిష్ఠ అయితే.. విగ్రహ ధ్వంసమని ప్రచారం చేయడమేంటి?’ అంటూ అయ్యన్న ధ్వజమెత్తారు.



Updated Date - 2021-01-20T20:44:36+05:30 IST