జీడీపీలో 24% క్షీణత!

ABN , First Publish Date - 2020-09-20T09:11:05+05:30 IST

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో ఉందని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తంచేశారు.

జీడీపీలో 24% క్షీణత!

సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ : యనమల



అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో ఉందని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. అభివృద్ధి పనులను ఆపేశారని, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చూపారన్నారు. అదే సమయంలో కొవిడ్‌ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యమూ కారణమని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్ర జీడీపీలో 24శాతం కోత పడే అవకాశముందని, ఒకపక్క ఆర్థికరంగం క్షీణిస్తుంటే మరోపక్క నిత్యావసర ధరలు, పన్నులు పెంచేసి పేదల బతుకులు దుర్భరం చేస్తున్నారన్నారు. 

Updated Date - 2020-09-20T09:11:05+05:30 IST