Abn logo
Sep 26 2021 @ 00:42AM

భారత బంద్‌కు టీడీపీ మద్దతు

విజయవంతం చేయాలని నేతల పిలుపు

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 25: ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న చేపట్టిన భారత బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారథి, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌, జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ వేర్వేరుగా పిలుపునిచ్చా రు. తెలుగు తమ్ముళ్లతోపాటు అన్నివర్గాల ప్రజలు బంద్‌ పాటించాలని కోరారు. నూతన చట్టాల మూ లంగా రైతాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. టీ డీపీ ఎంపీలు పార్లమెంటులో తమ వైఖరిని స్ప ష్టం చేశారన్నారు. రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వం రై తు వ్యతిరేక విధానాలు చేపట్టడం వల్ల అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. రైతులపై లేనిపోని భారాలు మోపుతూ పంపుసెట్లకు మీటర్లు ఏ ర్పాటు చేయడం, పంట నష్టం పరిహారం ఇవ్వకపోవడంపై టీడీపీ పోరాటం సాగిస్తూనే ఉందన్నారు. అ యినా సీఎం జగన పట్టించుకోకుండా రైతుద్రోహిగా నిలిచిపోతున్నారని మండిపడ్డారు. ఇలాంటి పాలకు ల కళ్లు తెరిపించడానికి భారత బంద్‌ను విజయవం తం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.