దేవగుడి భూపేశ్‌రెడి ్డకి టీడీపీ అధిష్ఠానం పిలుపు

ABN , First Publish Date - 2021-10-18T05:22:27+05:30 IST

టీడీపీ అధిష్ఠానం దేవగుడి భూపేశ్‌రెడ్డికి ఈనెల 20వ తేదీన విజయవాడ పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపు వచ్చినట్లు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడి ్డ పేర్కొన్నారు.

దేవగుడి భూపేశ్‌రెడి ్డకి టీడీపీ అధిష్ఠానం పిలుపు
విలేకరులతో మాట్లాడుతున్న దేవగుడి నారాయణరెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 17:  టీడీపీ అధిష్ఠానం దేవగుడి భూపేశ్‌రెడ్డికి ఈనెల 20వ తేదీన విజయవాడ పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపు వచ్చినట్లు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడి ్డ పేర్కొన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ గతంలో పనిచేసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులను అందరిని కలుపుకునిపోవాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం జరిగిందని  ఆయన ఆదేశాల మేరకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కరోనా కారణంగ ఫోన్ల ద్వారా పిలిచి మాట్లాడటం జరిగిందన్నారు. అందరూ తమకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారన్నారు. తన కుమారుడు భూపేశ్‌రెడ్డికానీ, తాను కానీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీలో ఉంటామన్నారు. అందులో భాగంగానే 20వ తేదీ (బుధవారం) సాయంత్రం 3 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని ఆయన ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అందరిని కలుపుకుని ముందుకు పోతామని, తమ కుమారుడిని అందరూ ఆదరించాలని ఆయన కోరారు,

అటకెక్కిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు

జగనన్న కాలనీల్లో దసరా పండుగ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకటనలు మాటలకే పరిమితం అయ్యాయని మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి విమర్శించారు. పేదలకు సెంటు, సెంటున్నర స్థలాలు ఇచ్చి కక్కుర్తి వ్యవహారం చేసి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇంటి నిర్మాణం చేస్తామని చెప్పి మాట మార్చారన్నారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూర్యారాయల్‌, కాట రామదాసు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:22:27+05:30 IST