రాజ్యసభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం

ABN , First Publish Date - 2021-12-13T23:54:09+05:30 IST

రాజ్యసభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభ జరుగుతున్న సమయంలో జడ్జిల జీతాలు, ఉద్యోగ విధుల బిల్లుపై ఎంపీ కనకమేడల మాట్లాడారు. అంతేకాదు ఏపీలో..

రాజ్యసభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం

న్యూఢిల్లీ: రాజ్యసభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభ జరుగుతున్న సమయంలో జడ్జిల జీతాలు, ఉద్యోగ విధుల బిల్లుపై ఎంపీ కనకమేడల మాట్లాడారు. అంతేకాదు ఏపీలో రాజకీయ అరాచకం నెలకొందని, పోలీసులు రాజకీయ బాస్‌లకు తలొగ్గి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని కనకమేడల సభకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నందునే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని, ఏపీలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కనకమేడల అన్నారు. దీంతో కనకమేడల ప్రసంగాన్ని ఎంపీలు మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి అడ్డుకున్నారు. ఏపీకి వ్యతిరేకంగా ఎంపీ కనకమేడల చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని వైసీపీ ఎంపీలు పట్టుబట్టారు. ఈ ఘటనతో సభ కొంతసేపు దద్దరిల్లింది. 


Updated Date - 2021-12-13T23:54:09+05:30 IST