Abn logo
Sep 19 2021 @ 14:50PM

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ విజయాలు

చిత్తూరు: వైసీపీ హవాలో కూడా టీడీపీ నేతలు విజయాలు సాధిస్తున్నారు. అయితే కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. వైసీపీ అభ్యర్థులకు టీడీపీ అభ్యర్థులు చమటలు పట్టించారు. కుప్పం నియోజకవర్గంలో పలు చోట్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పెద్ద బంగానత్తం ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు 232 ఓట్లతో సమీప అభ్యర్థిపై గెలుపొందారు. కంగుంది-2 ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి మోహన్ 80 ఓట్లతో విజయం సాధించారు. శాంతిపురం సి.బండపల్లె ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి జయకేతనం ఎగురవేశారు. కుప్పం మండలం కొట్టలూరు వైసీపీ అభ్యర్థిపై టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి సి.సుబ్రయంణ్యం 85 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మదనపల్లె మండలం కొత్తపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దేవేంద్ర 148 ఓట్లతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. 


స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష అభ్యర్థుల మీద వైసీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా టీడీపీ  పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు టీడీపీ దూరం కావడంతో పరిషత్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం బాగా తగ్గింది. సర్పంచి, మున్సిపాలిటీ ఎన్నికల్లో 80శాతానికిపైగా పోలింగు నమోదైతే.. అదే స్థానిక సంస్థలైన పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం 61.34 శాతంగా నమోదైంది.  

ఇవి కూడా చదవండిImage Caption