రూ.20 లక్షల నగదు ఉపసంహరణపై టీడీఎస్‌

ABN , First Publish Date - 2020-07-13T05:55:53+05:30 IST

ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి రూ.20 లక్షల పైబడి నగదు ఉపసంహరించే ఖాతాదారులపై ఎంత టీడీఎస్‌ వసూలు చేయాలనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీబీడీటీ వెల్లడించింది...

రూ.20 లక్షల నగదు ఉపసంహరణపై టీడీఎస్‌

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి రూ.20 లక్షల పైబడి నగదు ఉపసంహరించే ఖాతాదారులపై ఎంత టీడీఎస్‌ వసూలు చేయాలనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీబీడీటీ వెల్లడించింది. అలాగే రూ.కోటి పైబడి ఉపసంహరించే ఇతర కస్టమర్లకు ఇది అందుబాటులో ఉండనుంది. దీని ప్రకారం బ్యాంకులు, పోస్టాఫీసులు సంబంధిత ఖాతాదారు పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే వారి వెబ్‌సైట్‌పై ఒక మెసేజ్‌ వస్తుందని, దాని ప్రకారం వారు టీడీఎస్‌ మినహాయిస్తే సరిపోతుందని పేర్కొంది.


రూ.20 లక్షలు పైబడి విత్‌డ్రా చేసే వారికి 2 శాతం, రూ.కోటి పైబడి ఉపసంహరిస్తే 5 శాతం వంతున ఎంత టీడీఎస్‌ అవుతుందనేది వారికి తెలియచేయనున్న ట్లు వెల్లడించింది. ఇంతవరకు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయని వారి పేర్ల మీద భారీ నగదు ఉపసంహరణలు జరుగుతున్నట్టు వెల్లడైన నేపథ్యంలో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా సీబీడీటీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 


Updated Date - 2020-07-13T05:55:53+05:30 IST