Abn logo
Sep 26 2020 @ 03:46AM

గురువుగారు.. ఘంటసాల

Kaakateeya

బాలుకు సినిమా అవకాశాలు కొత్తగా వస్తున్న రోజులవి. విజయనిర్మల ఇంట్లో బాలు తన స్నేహితులు మరో ముగ్గురితో కలిసి అద్దెకు ఉండేవారు. ఒకరోజు ఆయన కాలేజీ నుంచి సాయంకాలం ఇంటికి వచ్చేసరికి.. ఇంటి ముందు అరుగు మీద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆయనెవరో కాదు.. మధుర గాయకుడు ఘంటసాల. ఆయన్ను చూడగానే బాలు.. ‘నిజమా కలా.. ఎందుకు వచ్చారు మాస్టారు ఇక్కడికి..’ అనుకుంటూ హడావుడిగా బండి ఆపి.. స్టాండు కూడా వేయకుండా, కింద పడేసి మాస్టారు దగ్గరకు వెళ్లారు.


‘ఏంటి మాస్టారు ఇక్కడ కూర్చున్నారు? రాళ్ల మీద’ అని బాలు అడిగితే.. ‘‘ఏం లేదు నాన్నా, నేను ‘ఆలీబాబా 40 దొంగలు’ సినిమాకు మ్యూజిక్‌ చేస్తున్నాను కదా.. దాంట్లో నువ్వు కూడా ఒక పాట పాడాలి. ప్రొడక్షన్‌ వాళ్లకు చెప్పడం దేనికని నేనే వచ్చాను’’ అని చెప్పారు. ఈ సంఘటనను బాలు ఎప్పుడూ గుర్తుచేసుకునేవారు. ‘అప్పటికి బాలసుబ్రమణ్యం కోన్‌కిస్కా. నాలాంటివాడి కోసం ఆ మహానుభావుడు వచ్చారంటే.. అదీ మానవత్వం. అదీ ఆప్యాయత’ అని తలచుకునేవారు. ఘంటసాలతో కలిసి తాను పాడిన ‘ప్రతీరాత్రి వసంతరాత్రి..’, ‘ఇంకా తెలవారదేమి.. ఈ చీకటి విడిపోదేమి..’, ‘దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లారా..’ పాటలను పదేపదే జ్ఞాపకం చేసుకునేవారు.


ఘంటసాల అంటే బాలుకు గురుభావం ఉండేది. అందుకే హైదరాబాద్‌ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయనపై తనకున్న అభిమానాన్ని  చాటుకున్నారు. 1993 ఫిబ్రవరి 14న ప్రముఖ గాయని లతామంగేష్కర్‌ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Advertisement
Advertisement
Advertisement